కర్ణాటక పోలీసులు హీరా గ్రూప్ సంస్థల ఎండీ నౌహీరా షేక్‌ను అదుపులోకి తీసుకున్నారు. బళ్లారీలో నమోదైన కేసు విచారణకు ఆమెను చంచల్‌గూడ మహిళా జైలు నుంచి కర్ణాటక తీసుకెళ్లారు. నాంపల్లి న్యాయస్థానంలో పీటీ వారెంట్ సమర్పించి న్యాయస్థానం అనుమతి మేరకు హీరాను తరలించారు. ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య చికిత్సలు నిర్వహించిన అనంతరం బళ్లారి తీసుకెళ్లారు. బంగారంలో పెట్టుబడులు పెడితే... అధిక వడ్డీ ఇస్తామని నౌహీరా షేక్.. మదుపుదార్లను కోట్ల రూపాయల్లో మోసం చేశారు. లక్ష మందికిపైగా మదుపుదారుల నుంచి 6 వేల కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సీసీఎస్ పోలీసుల దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా విదేశాల నుంచి కూడానిధులు సమీకరించినట్లు గుర్తించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, ముంబయి, ఢిల్లీలోనూ నౌహీరా షేక్‌పై కేసులు నమోదయ్యాయి.
నౌహీరా షేక్‌ను అదుపులోకి తీసుకున్న బళ్లారి పోలీసులు - ballary
హీరా గ్రూప్ సంస్థల ఎండీ నౌహీరాషేక్‌ను బళ్లారీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నమోదైన కేసులో దర్యాప్తు కోసం ఆమెను చంచల్‌గూడ మహిళా జైలు నుంచి ఇవాళ తీసుకెళ్లారు.
నౌహీరా షేక్