Balkampet Yellamma Kalyanam in Tomorrow :బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవె అంగరంగ వైభవంగా జరుగనుంది. సోమవారం రోజున ఎదుర్కోలు ఉత్సవం.. 20వ తేదీన అమ్మవారి కల్యాణం, 21న రథోత్సవం కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు అందుకు తగిన ఏర్పాట్లను పూర్తి చేశారు. ప్రధానంగా అమ్మవారి కల్యాణాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా.. అన్ని చర్యలు తీసుకున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
కల్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తాం : ప్రతి సంవత్సరం లాగే వివిధ శాఖల ఆధ్వర్యంలో.. పకడ్బందీగా ఏర్పాట్లును పర్యవేక్షిస్తూ.. కల్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. గత సంవత్సరం ఉత్సవాలకి 8 లక్షల మంది భక్తులు వచ్చారని.. ఈ ఏడాది దాదాపుగా 15లక్షల వరకు వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. గతంలో అతికొద్ది మంది సమక్షంలో జరిగే ఈ వేడుక.. ప్రస్తుతం కొన్ని లక్షల మంది మధ్య జరుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలందరూ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించే విధంగా ఆలయం సమీపంలో ఎల్‌ఈడీ స్క్రీన్‌లను సిద్ధం చేశామని తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు.
"బల్కంపేట ఎల్లమ్మ వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కల్యాణాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు చేపట్టాం. ఈ మేరకు అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేశాం. గత ఏడాది ఉత్సవాలకి 8 లక్షల మంది భక్తులు హాజరయ్యారు. ఈ సంవత్సరం 15 లక్షల మంది వస్తారని అంచనా. గతంలో అతికొద్ది మంది సమక్షంలో జరిగే ఈ వేడుక.. ప్రస్తుతం కొన్ని లక్షల మంది మధ్య జరుగుతుంది. ప్రజలందరూ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించే విధంగా ఆలయం సమీపంలో ఎల్‌ఈడీ స్క్రీన్‌లను సిద్ధం చేశాం. ప్రత్యేక పోలీసు బలగాలతో బందోబస్తు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం."- తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి