తెలంగాణ

telangana

ETV Bharat / state

'బండి సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు' - Balka Suman latest Comments

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​పై... ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శలు గుప్పించారు. ఎంపీగా ఉన్న సంజయ్ రాజ్యాంగ బద్ధ సంస్థలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.

'బండి సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు'
'బండి సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు'

By

Published : Dec 15, 2020, 3:32 PM IST

సీఎం కేసీఆర్ దిల్లీ పర్యటనపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌ ఆరోపించారు. ప్రధానిని ముఖ్యమంత్రులు కలవడం సాధారణ విషయమని... కేంద్ర, రాష్ట్రాల మధ్య అనేక విషయాలు ఉంటాయన్నారు. ఎంపీగా ఉన్న సంజయ్ రాజ్యాంగబద్ధ సంస్థలపై అవగాహన పెంచుకోవాలని బాల్క సుమన్ అన్నారు.

కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, బకాయిలపైనే ప్రధాని, కేంద్ర మంత్రులను సీఎం కేసీఆర్ కలిశారన్నారు. స్థాయి లేని వారు కూడా కేసీఆర్​పై మాట్లాడున్నారని బాల్క సుమన్ ధ్వజమెత్తారు. కేసీఆర్​పై ఆచితూచి మాట్లాడాలని బండి సంజయ్ పద్ధతి మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.

ABOUT THE AUTHOR

...view details