11 రోజుల పాటు నిత్యం పూజలను అందుకున్న బాలాపూర్ గణనాథుడు నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ వైపు బయలుదేరాడు. బాలాపూర్ గణేశుడి లడ్డుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. 26 సంవత్సరాల క్రితం 450కి మొదలైన లడ్డు వేలం... గత సంవత్సరం 17 లక్షల 60 వేలకు కోలన్ బ్రదర్స్ కైవసం చేసుకున్నారు.
వేలం పాట రద్దు.. ఈసారి బాలాపూర్ లడ్డు ముఖ్యమంత్రి కేసీఆర్‌కే.. - ganesh immersion 2020
ఖైరతాబాద్ తర్వాత అత్యంత ప్రసిద్ధి పొందిన బాలాపూర్ గణేశుడి నిమజ్జనం శోభయాత్ర ప్రారంభమైంది. నవరాత్రి పూజలందుకున్న మహా గణపతిని... భక్తుల కోలాహలం మధ్య హుస్సేన్ సాగర్‌కి తరలిస్తున్నారు. కొవిడ్ కారణంగా ఈ సారి లడ్డూ వేలాన్ని రద్దు చేసినట్లు ఉత్సవ సమితి తెలిపింది.
వేలం పాట రద్దు.. ఈసారి బాలాపూర్ లడ్డు ముఖ్యమంత్రి కేసీఆర్‌కే..
అయితే ఈ సంవత్సరం కరోనా నేపథ్యంలో బాలాపూర్ గణనాధుడి లడ్డు వేలం పాటను రద్దుచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లడ్డును అందజేయనున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపారు. ఆనవాయితీ ప్రకారం బాలాపూర్‌లో ఊరేగింపు అనంతరం నిమజ్జనం కోసం హుస్సేన్ సాగర్‌కి బయలుదేరాడు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీచూడండి..బోగత జలపాతం వద్ద మృతదేహం లభ్యం
Last Updated : Sep 1, 2020, 2:58 PM IST