తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆరడుగుల ఎత్తులో కొలువైన బాలాపూర్​ గణేశుడు

భాగ్యనగరంలో ఖైరతాబాద్​ వినాయకుడి తర్వాత అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే బాలాపూర్​ గణేశుడు నవరాత్రులకు ముస్తాబవుతున్నాడు. కరోనా పరిస్థితుల దృష్ట్యా కేవలం ఆరడుగుల గణపతి విగ్రహాన్ని మండపంలో కొలువుదీర్చారు.

balapur ganesh idol height is six feet due to corona pandemic
ఆరడుగుల ఎత్తులో కొలువైన బాలాపూర్​ గణేశుడు

By

Published : Aug 21, 2020, 3:44 PM IST

నవరాత్రులకు హైదరాబాద్​ బాలాపూర్​ వినాయకుడు ముస్తాబవుతున్నాడు. కరోనా పరిస్థితుల దృష్ట్యా బాలాపూర్​ గణేశ్ విగ్రహం ఎత్తును ఆరడుగులకు తగ్గించి మండపంలో కొలువుదీర్చారు. ధూల్​పేటలో తయారు చేసిన లంబోదరుణ్ని బాలాపూర్​ గణేశ్​ ఉత్సవ కమిటీ సభ్యులు మండపానికి చేర్చారు. గాలిగోపురం తరహాలో మండపాన్ని సుందరంగా తీర్చిదిద్దారు.

కొవిడ్ నిబంధనల దృష్ట్యా మొదటిసారిగా బాలాపూర్​ గణేశ్ ఉత్సవాలు నిరాడంబరంగా నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. లడ్డూ వేలం పాటనూ రద్దు చేసినట్లు వెల్లడించారు. నవరాత్రులయ్యాకు పోలీసులు అనుమతిస్తే బాలాపూర్​ గణేశుణ్ని వినాయకసాగర్​ వైపు శోభాయాత్రగా తీసుకెళ్తామని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details