కరోనా వైరస్ నివారణకు హైదరాబాద్ బాలానగర్లో తమ వంతు బాధ్యతగా మద్యం దుకాణాదారులు కృషి చేస్తున్నారు. మద్యం షాపు ముందు ఇష్టం వచ్చినట్లు నిల్చోకుండా డబ్బాలను గీశారు. అందులో మనిషి మనిషికి కొంత దూరం నిల్చునేలాగా ఏర్పాట్లు చేశారు.
కరోనా నివారణకు మద్యం షాపు యాజమాన్యం కృషి - కరోనా నివారణకు మద్యం షాపు యాజమాన్యం కృషి
హైదరాబాద్ బాలానగర్లో మద్యం దుకాణాదారులు తమ వంతు బాధ్యతగా కరోనా నివారణకు ముందడగు వేశారు. ఇందుకోసం దుకాణం ఎదుట వ్యక్తి నిలబడేందుకు డబ్బా ఆకారంలో గీత గీశారు. మద్యం కోనుగోలుదారులు అందులో నిల్చునే మద్యం తీసుకుంటున్నారు.

కరోనా నివారణకు మద్యం షాపు యాజమాన్యం చర్యలు
ఇందుకు అనుగుణంగా గీసిన డబ్బాల్లో నిల్చొని మద్యం కొనుగోలు చేస్తున్నారు. కరోన వైరస్ సోకకుండా ముందస్తుగా చర్యలు చేపట్టినట్లు యాజమాన్యం స్పష్టం చేసింది. స్పందించిన స్థానికులు నిర్వాహకులను అభినందిస్తున్నారు.
కరోనా నివారణకు మద్యం షాపు యాజమాన్యం చర్యలు
TAGGED:
BALANAGAR WINES SHOP