తెలంగాణ

telangana

ETV Bharat / state

బంతి బంతికి బెట్టింగ్​.. పోలీసులకి చిక్కిన గ్యాంగ్​.. కోటి స్వాధీనం

IPL 2023 Cricket Betting: ఐపీఎల్​ 2023 మొదలయినప్పటీ నుంచి సైబరాబాద్​ పోలీసులు భద్రతతో పాటు బెట్టింగ్​ పైనా శ్రద్ధ పెట్టారు. ఈరోజు స్పెషల్​ ఆపరేషన్​ టీమ్​ నగరంలో బెట్టింగ్​ చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. వారి దగ్గర నుంచి రూ.కోటి విలువైన నగదుతో పాటు పరికరాలను తీసుకున్నారు.

ipl betting in hyderabad
ipl betting in hyderabad

By

Published : Apr 11, 2023, 7:11 PM IST

Updated : Apr 12, 2023, 7:53 AM IST

బంతి బంతికి బెట్టింగ్​.. పోలీసులకి చిక్కిన గ్యాంగ్​.. కోటి స్వాధీనం

IPL 2023 Cricket Betting: ఐపీఎల్ సీజన్​ వచ్చిందంటే ప్రతి ఒక్కరికి ఆనందమే. రోజూ కొందరు క్రికెట్​ మ్యాచ్ కోసం ఎదురుచూస్తే.. మరికొందరు​ అదే మ్యాచ్​లో బెట్టింగ్​ వేసేందుకు వేచిచూస్తుంటారు. బెట్టింగ్ చట్టరీత్యా నేరంగా పరిగణిస్తారు. అందువల్ల చాలా మంది యువకులు వారి సంపాదించుకున్న డబ్బులను కోల్పోడంతో పాటు.. పోలీసులకు చిక్కి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. హైదరాబాద్​లో క్రికెట్​ మ్యాచుల్లో బెట్టింగ్​కు పాల్పడుతున్న ముఠాను బాలానగర్​ ఎస్​ఓటీ పోలీసులు అరెస్ట్​ చేశారు.

ఏ ప్రదేశంలో ముఠా దోరికింది:ఐపీఎల్ క్రికెట్ మ్యాచుల్లో బెట్టింగ్ జరగొచ్చనే ఉద్దేశంతో పోలీసులు నగరంలో పలు చోట్ల నిఘా పెట్టారు. బాచుపల్లిలోని సాయి అనురాగ్ కాలనీలోని ఓ అపార్ట్ మెంట్​లో బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారం రావడంతో.. బాలానగర్ ఎస్ఓటీ, బాచుపల్లి పోలీసులు వెళ్లి సోదాలు చేశారు. పలువురు బుకీలను ఏర్పాటు చేసుకొని యూసఫ్​గూడకు చెందిన వెంకట శివ రామకృష్ణ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడకు చెందిన ప్రధాన బుకీ పాండు పరారీలో ఉన్నాడు.

బెట్టింగ్​లో పట్టుకున్న డబ్బులు

రూ.60 లక్షల నగదు స్వాధీనం: ఐపీఎల్ క్రికెట్ మ్యాచుల్లో బెట్టింగ్ వేస్తున్న10 మంది బుకీలను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఒకేసారి 108 మంది పంటర్లతో బెట్టింగ్‌ కాసేందుకు వీలుగా నిందితులు.. లైన్‌బోర్డులు, ఫోన్లు వినియోగిస్తూ పట్టుబడ్డారు. వారి దగ్గర నుంచి రూ.60 లక్షల నగదుతో పాటు.. ల్యాప్​టాప్​లు, కంప్యూటర్లు, సెల్​ఫోన్లు, బెట్టింగ్​కు ఉపయోగించే ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. డబ్బుతో పాటు పరికరాల విలువ మొత్తం రూ.కోటి ఉంటుందని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.

ఐపీఎల్​ క్రికెట్​ బెట్టింగ్​ చేస్తున్న గ్యాంగ్​ అరెస్ట్

బంతి బంతికి బెట్టింగ్​:క్రికెట్ మ్యాచులలో బెట్టింగ్ పెట్టాలనుకునే వాళ్లు సాధారణంగా అంతర్జాలం వెతుకుతుంటారని.. అలాంటి వాళ్లను ఆకట్టుకునే విధంగా సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. రాష్ట్రంలో బెట్టింగ్‌పై నిషేధం ఉండటంతో బుకీలు.. ప్రత్యేక మొబైల్‌ అప్లికేషన్లు రూపొందించి బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారు. పలు సామాజిక మాధ్యమాల ద్వారా బెట్టింగ్‌ రాయుళ్లతో అప్లికేషన్లు డౌన్‌లోడ్‌ చేయించుకుంటున్నారు. కొంత నగదు చెల్లిస్తే.. యూజర్‌ఐడీ, పాస్‌వర్డ్‌లు ఇచ్చి దందాకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. తమను సంప్రదించే బుకీలను, నిందితులు ప్రత్యేక సెల్​ఫోన్ నెంబర్​తో పాటు బెట్టింగ్ డబ్బులు జమ చేసేందుకు బ్యాంకు ఖాతా నెంబర్ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. పందెంరాయుళ్లకు కేజీఎఫ్​, సీఎం, కోటి, బైరా వంటి కోడ్‌నేమ్‌లు ఇస్తున్నారని చెప్పారు. బంతి.. బంతికి బెట్టింగ్ నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. కనీసం రూ.50 వేలతో బెట్టింగ్ పెట్టేలా బుకీలు ఏర్పాట్లు చేశారని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.

"సాయి అనురాగ్​ కాలనీలో 10 మంది బుకీలు క్రికెట్​ బెట్టింగ్​ చేస్తున్నారని సమాచారం వచ్చింది. వెంటనే వెళ్లి దాడి చేశాం. దీంతో అక్కడ బెట్టింగ్​ చేస్తున్న వ్యక్తులను పట్టుకుని అరెస్ట్​ చేశాం. రూ.60 లక్షలు వరకు నగదు సీజ్​ చేశాం. మనీతో పాటు వారు బెట్టింగ్​కి ఉపయోగిస్తున్న వస్తువులన్నింటిని స్వాధీనం చేసుకున్నాం. మొత్తం విలువ కోటి రూపాయలు ఉంటుంది."-స్టీఫెన్ రవీంద్ర, సైబరాబాద్ సీపీ

ఇవీ చదవండి:

Last Updated : Apr 12, 2023, 7:53 AM IST

ABOUT THE AUTHOR

...view details