హైదరాబాద్ బాలానగర్ ప్లై ఓవర్ పనుల కోసం భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అధికారులకు తెలిపారు. ప్లైఓవర్ నిర్మాణ పనులను ఒక దశకు తెచ్చేందుకు లాక్‌డౌన్ సమయానికి మించిన అవకాశం రాదని పేర్కొన్నారు. బాలానగర్ ప్లై ఓవర్ పనులపై అధికారులతో మేయర్ సమీక్షించారు.
బాలానగర్ ఫ్లైఓవర్ పనులు వేగవంతం చేయాలి : మేయర్ - GHMC Mayor Bonthu Ram mohan Latest News
లాక్‌డౌన్ సమయాన్ని వినియోగించుకుని హైదరాబాద్ బాలానగర్ ఫ్లైఓవర్ పనులు వేగవంతం చేయాలని జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ సూచించారు. ఫ్లై ఓవర్ నిర్మాణ పనులపై అధికారులతో ఆయన సమీక్షించారు.
![బాలానగర్ ఫ్లైఓవర్ పనులు వేగవంతం చేయాలి : మేయర్ మేయర్ రామ్మోహన్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7003275-920-7003275-1588246385408.jpg)
మేయర్ రామ్మోహన్
భూ సేకరణకు ప్రజలు సహకరించాలని కోరారు. కొందరు యజమానుల అభ్యంతరాల వల్ల పనులు పూర్తి చేసేందుకు ఇబ్బంది కలుగుతోందని మేయర్ పేర్కొన్నారు. బాలానగర్ రహదారి 24 గంటలు రద్దీగా ఉంటుందని... లాక్‌డౌన్ తర్వాత ట్రాఫిక్‌ను నియంత్రించడం కష్టమని తెలిపారు. ఈ సమయంలోనే ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆయన అధికారులకు సూచించారు.
ఇదీ చూడండి:ప్రైవేటు ఆస్పత్రుల్లో ఓపి లేక రోగుల విలవిల