స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లైనా ఇప్పటికీ పౌష్టికాహారం లోపం గురించి మాట్లాడుకోవడం బాధిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. పౌష్టికాహార లోపంతో దేశ వ్యాప్తంగా చాలా మంది బాధ పడుతున్నారని... దీనిపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు జాతీయ పోషకాహార సంస్థ, యునిసెఫ్ సహాకారంతో... మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన బాలామృతం ప్లస్ కార్యక్రమాన్ని మంత్రులు ఈటల రాజేందర్, సత్యవతి రాఠోడ్ ప్రారంభించారు. వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స వ్యయంతో కూడుకున్నది... అందువల్ల ముందే జాగ్రత్తపడాలని మంత్రి సూచించారు.
పోషకాహార పైలట్ ప్రాజెక్టుగా ఆసిఫాబాద్, గద్వాల జిల్లాలు - హైదరాబాద్లో బాలామృతం ప్లస్ విడుదల
గ్రామీణ ప్రాంతాలతో పాటు.. నగర వాసులు కూడా పౌష్టికాహార లేమితో బాధపడుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అందరికీ పౌష్టికాహారం అందించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. మహిళ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన బాలామృతం ప్లస్ విడుదల కార్యక్రమాన్ని మంత్రులు ఈటల రాజేందర్, సత్యవతి రాఠోడ్ ప్రారంభించారు.
![పోషకాహార పైలట్ ప్రాజెక్టుగా ఆసిఫాబాద్, గద్వాల జిల్లాలు balamrutam plus launch in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5389884-thumbnail-3x2-bala-rk.jpg)
పోషకాహార పైలట్ ప్రాజెక్టుగా ఆసిఫాబాద్, గద్వాల జిల్లాలు
పోషకాహారాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఆసిఫాబాద్, గద్వాల్ జిల్లాల్లో అమలు చేస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ పేర్కొన్నారు. తల్లులు ఆరోగ్యంగా లేకపోవడం వల్లనే పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారన్నారు. బాలామృతం ప్లస్ సమర్థవంతంగా లబ్ధిదారులకు అందించాలని అధికారులకు ఆదేశించారు.
పోషకాహార పైలట్ ప్రాజెక్టుగా ఆసిఫాబాద్, గద్వాల జిల్లాలు
ఇదీ చూడండి: జనపనారతో సంచుల తయారీ... ఇంటివద్దే ఉపాధి