అనాథలు ఈ దేశ పౌరులుగా చెప్పుకునేందుకు ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేవని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుత రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆధార్, జనన ధ్రువీకరణ లాంటి గుర్తింపు పత్రాలను వెంటనే ఇచ్చేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను కోరారు.
అనాథశరణాలయాలన్నీ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని... దత్తత ప్రక్రియ వేగవంతం చేయాలని అన్నారు. దత్తత కోసం పిల్లలు లేని దంపతులు పడిగాపులు పడడమే కాకుండా... సంతాన సాఫల్య కేంద్రాలను ఆశ్రయించడం, పిల్లలను పొందేందుకు అడ్డుదారులు తొక్కడం చేస్తున్నారని పేర్కొన్నారు.