తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ చిరస్మరణీయుడని బాలకృష్ణ కొనియాడారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద దగ్గుబాటి పురందేశ్వరి, హరికృష్ణ కుమార్తె సుహాసినితోపాటు కుటుంబ సభ్యులతో కలిసి బాలయ్య నివాళులర్పించారు.
ఎన్టీఆర్ దేశానికే ఆదర్శం.. అనుసరణీయం: బాలకృష్ణ - ఎన్టీఆర్కు బాలకృష్ణ నివాళి
విప్లవాత్మక పథకాలతో ఎన్టీఆర్ ఇప్పటికీ, ఎప్పటికీ ప్రజల గుండెల్లో పదిలమని సినీ నటుడు బాలకృష్ణ తెలిపారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి కుటుంబసభ్యులు నివాళులర్పించారు.
'తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ చిరస్మరణీయుడు'
ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని గుర్తుచేశారు. ఎన్టీఆర్ నటించిన సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని సూచించారు. పార్టీ స్థాపించిన అనతి కాలంలోనే ముఖ్యమంత్రిగా ఎదిగి... విప్లవాత్మక పథకాలతో ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు.