భారతదేశంలోనే అత్యాధునిక సాంకేతికతో కూడిన 3డీ మామ్మోగ్రామ్ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన మొదటి ఆస్పత్రి బసవతారకం ఇండో అమెరికన్ కావటం విశేషమన్నారు ఆస్పత్రి ఛైర్మన్, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. నాణ్యమైన క్యాన్సర్ స్క్రీనింగ్‌తో పాటు.... బయాప్సి, వాక్యూమ్ అసిస్టెడ్ బయాప్సి, సింథసైజ్డ్ వ్యూ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్‌ని కలిగి ఉందని తెలిపారు. భవిష్యత్తులో మరికొన్ని సరికొత్త పరికరాలను అందుబాటులోకి తీసుకురావటమే కాకుండా.. పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు కావాల్సిన అన్ని రకాల సహకారాన్ని బసవతారకం అందిస్తుందని బాలకృష్ణ తెలిపారు. క్యాన్సర్‌పై ప్రజల్లో మరింతా అవగాహన పెంచాలని ఆస్పత్రి మేనేజింగ్ ట్రస్టీ కోడెల శివప్రసాద రావు సూచించారు.
'క్యాన్సర్‌పై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలి' - LAUNCHED
క్యాన్సర్ రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి అత్యాధునిక 3డీ మామ్మోగ్రఫీ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యంత్రాన్ని హిందూపూర్ ఎమ్మెల్యే, ఆస్పత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు.

3DMAMOGRAM