తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలుగు వెలుగులు ప్రపంచానికి చాటిన వ్యక్తి ఎన్టీఆర్​: బాలకృష్ణ - బాలకృష్ణ వార్తలు

ఎన్టీఆర్​ 25వ వర్ధంతిని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో నిర్వహించారు. ఆస్పత్రి ఆవరణలోని ఎన్టీఆర్​ దంపతుల విగ్రహాలకు బాలకృష్ణ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం క్యాన్సర్ బాధితులకు పండ్లు అందించారు. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు.

balakrishna
balakrishna

By

Published : Jan 18, 2021, 12:30 PM IST

దివంగత నేత ఎన్టీఆర్​... తెలుగు వెలుగులు ప్రపంచానికి చాటిన వ్యక్తని నందమూరి బాలకృష్ణ కొనియాడారు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన రామారావు చిత్రసీమకు వచ్చి అనేక పాత్రలు పోషించారని.. శ్రీకృష్ణుడు, శ్రీరాములు అంటే ఎన్టీఆరే అన్నట్లుగా ఉండేవారని బాలకృష్ణ వివరించారు. ఎన్టీఆర్ 25వ వర్ధంతిని బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో నిర్వహించారు. ఎన్జీఆర్ దంపతుల విగ్రహానికి పూలమాలలు వేసిన బాలకృష్ణ నివాళులర్పించారు.

బసవతారకం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ​తెదేపాను ఎన్టీఆర్ స్థాపించి పేదల జీవితాల్లో వెలుగులు నింపిన వ్యక్తిని పేర్కొన్నారు. అన్ని వర్గాల వారికి అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చిన ఎన్టీఆర్‌... పటేల్‌ పట్వారీ వ్యవస్థను నిర్మూలించారని తెలిపారు. తమ తల్లి కోరిక మేరకు క్యాన్సర్ వైద్యాన్ని తక్కువ ధరకు అందించాలని ఈ ఆస్పత్రిని నిర్మించారన్నారు. కరోనా పరిస్థితుల్లోనూ తమ వైద్య సిబ్బంది అద్భుత సేవలందించారని కొనియాడారు.

తెలుగు వెలుగులు ప్రపంచానికి చాటిన వ్యక్తి ఎన్టీఆర్​: బాలకృష్ణ

ABOUT THE AUTHOR

...view details