తెలంగాణ

telangana

ETV Bharat / state

'రోగులకు మెరుగైన సేవలందించేందుకే మా ప్రయత్నం'

Balakrishna on bheem: బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చి ఇన్​స్టిట్యూట్ భీమ్‌ పేరుతో హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్​మెంట్ సిస్టంను అందుబాటులోకి తెచ్చింది. భీమ్‌ సిస్టంను క్యాన్సర్‌ ఆసుపత్రి ఛైర్మన్‌ బాలకృష్ణ ప్రారంభించారు.

Balakrishna
Balakrishna

By

Published : Apr 2, 2022, 7:24 PM IST

'రోగులకు మెరుగైన సేవలందించేందుకే మా ప్రయత్నం'

Balakrishna on bheem: రోగులకు నాణ్యమైన, పారదర్శకతో కూడిన సేవలతో పాటు ఆసుపత్రి, వైద్యుల పూర్తి సమాచారం అందించేందుకు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చి ఇన్​స్టిట్యూట్ భీమ్‌ పేరుతో హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్​మెంట్ సిస్టంను అందుబాటులోకి తెచ్చింది. గీతం డీమ్డ్‌ యూనివర్సిటీ సహాకారంతో రూపొందించిన భీమ్‌ సిస్టంను క్యాన్సర్‌ ఆసుపత్రి ఛైర్మన్‌ బాలకృష్ణ ప్రారంభించారు.

రోగులకు నాణ్యమైన, పారదర్శకతతో కూడిన సేవలను అన్ని వర్గాలకు సమాన స్థాయిలో అందేలా చూడడంలో ఈ సాఫ్ట్​వేర్ కీలక పాత్ర పోషిస్తుందని ఆసుపత్రి ఛైర్మన్‌ బాలకృష్ణ తెలిపారు. రోగులకు సంబంధించిన రికార్డులను వారి ఇంటి వద్ద నుంచే చూసుకునే వీలు కలిపించే విధంగా ఈ సాఫ్ట్​వేర్​లో రూపొందించినట్లు చెప్పారు. అత్యాధునిక సెక్యూరిటీ, ప్రైవసీ పరిరక్షణకు సంబంధించిన అంశాలను జోడించి రూపొందించడం జరిగిందన్నారు.

ఇది తొలి అడుగు మాత్రమేనని భవిష్యత్తులో మరింత సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఈ సాఫ్ట్​వేర్​ను ఎప్పటికపుడు అత్యాధునికంగా తీర్చిదిద్దుతామని బాలకృష్ణ అన్నారు. క్యాన్సర్​తో భాదపడుతున్న రోగులకు అందుబాటైన ధరలలో, ప్రపంచ స్థాయి నాణ్యమైన సేవలను అందించడంలో సంస్థ ఎప్పుడు ముందంజలో ఉంటోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణతో పాటు గీతం డీమ్డ్‌ యూనివర్సిటీ ప్రెసిడెంట్‌, ట్రస్ట్‌ సభ్యులు భరత్‌, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details