Nandamuri Tarakaratna Health Condition: నందమూరి తారకరత్న చికిత్సకు స్పందిస్తున్నారని నందమూరి బాలకృష్ణ తెలిపారు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం నిలకడగానే ఉందని వివరించారు. చికిత్సకు స్పందిస్తున్నారని.. ఆరోగ్య పరిస్థితి నిన్నటి కంటే మెరుగ్గానే ఉందని వెల్లడించారు. తారకరత్నకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారని.. ఆయన త్వరలోనే కోలుకోవాలని అభిమానులు ప్రార్థించాలని బాలకృష్ణ కోరారు.
నిలకడగానే ఆరోగ్యం..: తారకరత్న ఆరోగ్యం నిలకడగానే ఉందని జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించారు. తారకరత్న వైద్యానికి స్పందిస్తున్నారని చెప్పారు. తనకు మెరుగైన వైద్యం అందుతుందని తెలిపారు. కుటుంబసభ్యులు అందరం తారకరత్న కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని అన్నారు. అందరి ఆశీస్సులు తారకరత్నకు కావాలని కోరారు. కర్ణాటక వైద్యశాఖ మంత్రి సుధాకర్ ఎంతో సహకారం అందిస్తున్నారని ఎన్టీఆర్ వివరించారు.