Balakrishna : హైదరాబాద్ బసవతారకం ఆస్పత్రిలో.. మరింత ఎక్కువ మంది రోగులకు సేవలు అందించే లక్ష్యంతో.. నాలుగో డే కేర్ యూనిట్‌ని ఆస్పత్రి అందుబాటులోకి తీసుకువచ్చింది. నూతనంగా ఏర్పాటు చేసిన డే కేర్ యూనిట్‌ని.. ఆస్పత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ శనివారం ప్రారంభించారు. ఇప్పటికే ఆస్పత్రిలో మూడు డే కేర్ యూనిట్లు అందుబాటులో ఉండగా.. తాజాగా అందుబాటులోకి వచ్చిన సదుపాయంతో కలిపి డే కేర్ చికిత్సకు 181 పడకలు అందుబాటులో ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
Balakrishna : బసవతారకం ఆస్పత్రిలో నాలుగో డే కేర్ యూనిట్ ప్రారంభించిన బాలకృష్ణ - బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి
Balakrishna : బసవతారకం ఆస్పత్రిలో ఎక్కువ మందికి సేవలందించాలనే లక్ష్యంగా నాలుగో డే కేర్ యూనిట్‌ని ఏర్పాటు చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన డే కేర్ యూనిట్‌ని... ఆస్పత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ శనివారం ప్రారంభించారు.
బసవతారకం ఆస్పత్రిలో ఎక్కువ మందికి సేవలే లక్ష్యంగా బాలకృష్ణ శ్రీకారం
ఆరోగ్య శ్రీ కింద సేవలు పొందుతున్న వారి కోసం.. ఇప్పటికే పడకలు పెంచామని నందమూరి బాలకృష్ణ తెలిపారు. నీతి ఆయోగ్, బసవతారకం ఆస్పత్రిలోని సదుపాయాలను పరిశీలించి.. దేశంలోనే అత్యుత్తమ ఆస్పత్రిగా గుర్తించినట్లు ఆయన వివరించారు.
ఇదీ చదవండి:పండక్కి ఊరెళ్తున్నారా..? ఇళ్లు గుల్లవకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!