Balakrishna Resorted to Road Route on Return Journey: ఏపీలోని ఒంగోలులో "వీరసింహారెడ్డి" సినిమా ముందస్తు విడుదల వేడుకకు హెలికాప్టర్‌లో వచ్చిన నందమూరి బాలకృష్ణకు.. తిరుగు ప్రయాణంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. శనివారం ఉదయం ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు బయల్దేరగా.. వాతావరణం సహకరించకపోవడం వల్ల.. స్టార్ట్ అయిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో వాతావరణం అనుకూలించేవరకు వేచి చూశారు.
బాలయ్య హెలికాప్టర్‌కు గ్రీన్‌సిగ్నల్.. హైదరాబాద్‌కు పయనం - ఏపీ తాజా వార్తలు
Balakrishna Resorted to Road Route on Return Journey: వీరసింహరెడ్డి చిత్రం ప్రీ రిలీజ్ కోసం హెలికాప్టర్లో ఒంగోలుకు వచ్చిన.. నటుడు బాలకృష్ణ, తిరుగు ప్రయాణం కాస్తా కష్టతరమైంది. శనివారం ఉదయం హైదరాబాద్‌కు బయలుదేరే సమయంలో వాతావరణం సహకరించకపోవడంతో కొద్ది సమయంలోనే వెనుదిరిగారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించే వరకు అక్కడే వేచి ఉండి.. అనంతరం రిటర్న్ అయ్యారు
![బాలయ్య హెలికాప్టర్‌కు గ్రీన్‌సిగ్నల్.. హైదరాబాద్‌కు పయనం Balakrishna](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17419612-724-17419612-1673071436332.jpg)
Balakrishna
వాతావరణ పరిస్థితులు మెరుగవగానే మళ్లీ హెలికాప్టర్లో హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ ప్రయాణంలో ఆయన వెంట సీనియర్ దర్శకుడు బి. గోపాల్ ఉన్నారు. శుక్రవారం రాత్రి వీరసింహరెడ్డి ప్రీరీలీజ్ ఈవెంట్‌ను ఒంగోలులో నిర్వహించారు. ఈ చిత్రంలో బాలకృష్ట హీరోగా నటిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం.. బాలకృష్ణ రాత్రి ఒంగోలులోనే బస చేశారు.
ఇవీ చదవండి:
Last Updated : Jan 7, 2023, 2:09 PM IST