MLA Balakrishna, Yanamala emotional on Kandukur incident: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కందుకూరులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన బహిరంగ సభలో 8 మంది కార్యకర్తలు మృతి చెందడం తమ మనసును తీవ్రంగా కలచివేసిందని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు విచారం వ్యక్తం చేశారు.
పార్టీ జెండా మోసే కార్యకర్తల పాడెను మోయాల్సి రావడం అత్యంత బాధాకరమని బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. 8 మంది కార్యకార్తల మరణవార్త 80 లక్షల కార్యకర్తల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిందన్నారు. మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు బాలకృష్ణ ప్రగాఢ సానుభూతి తెలిపారు.