హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిని నీతి ఆయోగ్.. భారతదేశంలోనే ఉత్తమ ప్రైవేట్ ట్రస్ట్ ఆస్పత్రిగా గుర్తించటం పట్ల ట్రస్టు ఛైర్మన్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘనత పూర్తిగా తన తండ్రి ఎన్టీఆర్దేనని బాలయ్య పేర్కొన్నారు. నిరుపేదలకు సాయం చేయటంతో పాటు.. ప్రపంచ స్థాయి క్యాన్సర్ చికిత్సను సరసమైన ధరకు అందించేలా.. ఆసుపత్రిని స్థాపించినట్లు తెలిపారు. తన తండ్రి కలను సాకారం చేసిన.. వైద్యులు, ఆసుపత్రి సిబ్బందికి బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.
basavatharakam: ఉత్తమ ఆస్పత్రిగా బసవ తారకం.. బాలకృష్ణ, లోకేశ్ హర్షం
బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిని నీతి ఆయోగ్.. భారతదేశంలోనే ఉత్తమ ప్రైవేట్ ట్రస్ట్ ఆస్పత్రిగా గుర్తించటం పట్ల ట్రస్టు ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. లాభాపేక్ష లేకుండా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి అందిస్తున్న సేవలకు గుర్తింపు దక్కడం సంతోషాన్నిచ్చిందని వారు అన్నారు.
బాలకృష్ణ, లోకేశ్
లాభాపేక్ష లేకుండా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి అందిస్తున్న సేవలకు గుర్తింపు దక్కడం సంతోషాన్నించ్చిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఆసుపత్రిని విలువలతో నడుపుతున్న ఛైర్మన్ బాలా మామకు.. వైద్య సిబ్బందికి అభినందనలంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి:Jagan on ts ministers : 'తెలంగాణ మంత్రులు ఎక్కువ మాట్లాడుతున్నారు'