తెలంగాణ

telangana

ETV Bharat / state

బాల బాబా జన్మదిన వేడుకల్లో పేదలకు దుప్పట్ల పంపిణీ - Bala_Sai_Baba_Birthday celebrations

హైదరాబాద్ దోమలగూడ​లో బాలసాయిబాబా 60వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్​ రెడ్డి హాజరై పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు.

Bala_Sai_Baba_Birthday celebrations at domalguda hyderabad
బాల బాబ జన్మదిన వేడుకల్లో పేదలకు దుప్పట్ల పంపిణీ

By

Published : Jan 20, 2020, 10:20 AM IST

బాలసాయిబాబా 60వ పుట్టినరోజు ఉత్సవాలను హైదరాబాద్​లో ఘనంగా నిర్వహించారు. దోమలగూడలోని బాలసాయి బాబా ఆశ్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు, మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారు కార్తిక్ రెడ్డి కలిసి నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.

ట్రస్ట్​లో కార్యక్రమాలు బాబా చెప్పినట్లే 'మానవ సేవే మాధవ సేవ' అనే భావనతో కొనసాగిస్తున్నట్లు మేనేజింగ్ ట్రస్టీ రామారావు తెలిపారు. సేవ ద్వారా దేవున్ని సంతృప్తి పరచగలమంటూ బాబా మాటలను ఆయన గుర్తు చేసుకున్నారు.

అందరూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయకపోయినా.. సేవ చేసే మనసు అందరికీ అలవాటుగా మారాలని రామారావు అన్నారు.

బాల బాబ జన్మదిన వేడుకల్లో పేదలకు దుప్పట్ల పంపిణీ

ఇదీ చదవండి:నిర్భయ దోషి పిటిషన్​పై నేడు 'సుప్రీం' విచారణ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details