తెలంగాణ

telangana

By

Published : Feb 14, 2021, 3:02 PM IST

ETV Bharat / state

'ఫిబ్రవరి 14ను వీర జవాన్ల దివస్‌ సంస్మరణ దినంగా ప్రకటించాలి'

పుల్వామా ఉగ్రదాడి గుర్తు చేసుకుంటూ అమీర్‌పేట కూడలిలో భజరంగ్ దళ్‌ ఆధ్వర్యంలో అమరులకు నివాళులు అర్పించారు. జవాన్ల త్యాగానికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని రాష్ట్ర కన్వీనర్ సుభాష్‌ చందర్‌ అన్నారు. ఫిబ్రవరి 14ను వీర జవాన్ల దివస్‌ సంస్మరణ దినంగా ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు.

bajrang-dal-pays-tributes-to-pulwama-martyrs-at-ameerpet-crossroads
పుల్వామా ఉగ్రదాడి అమరులకు అమీర్‌పేట కూడలిలో నివాళులు

ఫిబ్రవరి 14 వాలెంటైన్స్‌ డేని నిషేధించి వీర జవాన్ల దివస్‌ సంస్మరణ దినంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించాలని భజరంగ్ దళ్‌ రాష్ట్ర కన్వీనర్ సుభాష్‌ చందర్‌ డిమాండ్ చేశారు. ప్రేమికుల రోజు పేరుతో ఎక్కడైనా, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా అడ్డుకుంటామని హెచ్చరించారు. పబ్‌లు మాల్స్‌, గిఫ్ట్‌ షాప్స్‌ సొమ్ము చేసుకోవడానికే వాలెంటైన్స్​‌ డే జరుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పుల్వామా ఉగ్రదాడి ఘటనను గుర్తు చేసుకుంటూ హైదరాబాద్ అమీర్‌పేట కూడలిలో భజరంగ్ దళ్‌ ఆధ్వర్యంలో అమరులకు నివాళులు అర్పించారు. అమర జవాన్ల త్యాగానికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నారు. ఖైరతాబాద్ మండపం నుంచి నెక్లెస్ రోడ్ వరకు సాయంత్రం కాగడాల ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు.

ఇదీ చూడండి:వాలెంటైన్స్​ డే రోజునే.. ప్రేమ కోసం యువతి ఆత్మహత్య

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details