తెలంగాణ

telangana

ETV Bharat / state

డీజీపీ కార్యాలయం ముట్టడి.. భజరంగ్​దళ్ కార్యకర్తల అరెస్ట్​ - Bajrang Dal activist

బైంసా అల్లర్లు, లవ్ జిహాదీలకు వ్యతిరేకంగా.. భజరంగ్​దళ్ హైదరాబాద్​లోని డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించింది. ర్యాలీగా వచ్చిన కార్యకర్తలు.. ఆఫీస్​ లోనికి వెళ్లేందుకు యత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు.

Bajrang Dal activists attempted to storm the DGP's office
డీజీపీ కార్యాలయం ముట్టడికి యత్నించిన భజరంగ్ దళ్ కార్యకర్తలు

By

Published : Mar 16, 2021, 1:49 PM IST

ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా మరోవైపు భజరంగ్​దళ్.. డీజీపీ కార్యాలయ ముట్టడికి యత్నించింది. ర్యాలీగా వచ్చిన కార్యకర్తలు.. ఆఫీస్​ లోనికి వెళ్లేందుకు యత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు.

బైంసా అల్లర్లు, లవ్ జిహాదీలకు వ్యతిరేకంగా.. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో భజరంగ్ దళ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ డీజీపీ కార్యాలయం వద్దకు వచ్చారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. వారిని అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. అరెస్టులను భజరంగ్​ దళ్ కార్యకర్తలు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి:'రాజకీయ బీభత్సం సృష్టించేందుకే ఇలాంటి చర్యలు'

ABOUT THE AUTHOR

...view details