భజరంగ్‌దళ్ కార్యకర్తలు ప్రగతిభవన్ ముట్టడికి యత్నించారు. గోరక్ష చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రెండు వాహనాల్లో ప్రగతిభవన్ వైపుకు భజరంగ్ దళ్ కార్యకర్తలు వచ్చారు. ప్రగతిభవన్ గేటు వైపుకు వచ్చిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది.
PRAGATHI BHAVAN: ప్రగతిభవన్ ముట్టడికి భజరంగ్‌దళ్ కార్యకర్తల యత్నం - telangana varthalu
గోరక్ష చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భజరంగ్ దళ్ కార్యకర్తలు ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోగా.. తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించారు.
PRAGATHI BHAVAN: ప్రగతిభవన్ ముట్టడికి భజరంగ్‌దళ్ కార్యకర్తల యత్నం
భజరంగ్‌దళ్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ప్రగతిభవన్ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అదనపు సీపీ చౌహన్, సంయుక్త సీపీ శ్రీనివాస్ నేతృత్వంలో పోలీసులు భారీ బందోబస్తులో నిమగ్నమయ్యారు.
ఇదీ చదవండి: KOKAPET LANDS: కోకాపేట భూముల విక్రయం ప్రారంభం.. కనీస ధర ఎంతంటే..