హిందువులపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని వెంటనే అరెస్ట్ చేయాలంటూ భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. కోఠిలోని మహిళా కళాశాల వద్ద అక్బరుద్దీన్ దిష్టిబొమ్మ దహనం చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగం చేసిన అక్బరుద్దీన్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ నెల 23న మజ్లిస్ పార్టీ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఒక వర్గాన్ని కించపరిచేలా అక్బరుద్దీన్ మాట్లాడారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్‌గా మారాయి.
అక్బరుద్దీన్ ఓవైసీని వెంటనే అరెస్ట్ చేయాలి: భజరంగ్ దళ్ - అరెస్ట్ చేయాలి
హిందువులపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని వెంటనే అరెస్ట్ చేయాలంటూ భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు.
అక్బరుద్దీన్ ఓవైసీని వెంటనే అరెస్ట్ చేయాలి:భజరంగ్ దళ్