అఖిలప్రియకు బెయిల్.. నేడు విడుదల - akhila priya in kidnap case updates
18:00 January 22
షరతులతో కూడిన బెయిల్ మంజూరు
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి అఖిలప్రియకు సికింద్రాబాద్ సివిల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్‌ను న్యాయస్థానం మంజూరు చేసింది. 15 రోజులకు ఒకసారి సోమవారం రోజున బోయిన్పల్లి పీఎస్‌కు వచ్చి సంతకం చేసి వెళ్లాలని కోర్టు సూచించింది. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు న్యాయవాది వాదనలు వినిపించారు. బెయిల్ ఇవ్వడానికి సానుకూల అంశాలను న్యాయవాదులు ప్రస్తావనకు తీసుకురాగా... న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది.
భార్గవ్‌రామ్ బెయిల్ పిటిషన్‌ను మాత్రం కోర్టు తిరస్కరించింది. ఇప్పటికే పరారీలో ఉన్న భార్గవ్‌రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్ ముగిసిపోవటం వల్ల అతని పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఇవాళ ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి అఖిలప్రియ విడుదల కానున్నట్లు ఆమె తరఫు న్యాయవాది తెలిపారు.