సీఏఏ, ఎన్ఆర్సీ ఎన్పీఆర్కు వ్యతిరేకిస్తూ ఓయూ దూరవిద్యాకేంద్రంలో బహుజన సాహిత్య జాతర ఘనంగా జరిగింది. రాష్ట్రంలోని మేధావులు, కవులు, కాళాకారులు సమావేశంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ హాజరయ్యారు. రాజ్యాంగ పీఠిక గురించి 70 ఏళ్ల తర్వాత మాట్లాడుకోవడం బాధాకరమని వక్తలు అభిప్రాయపడ్డారు.
ఓయూ దూరవిద్యాకేంద్రంలో బహుజన సాహిత్య జాతర - bahujana jatara in ou center for distance education center
భారత రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఇవాళ ఓయూ దూర విద్యాకేంద్రంలో "బహుజన సాహిత్య జాతర" నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ హాజరయ్యారు.
ఓయూ దూరవిద్యాకేంద్రంలో బహుజన సాహిత్య జాతర
సీఏఏ, ఎన్ఆర్సీ ముస్లిం ప్రజలకే కాకుండా... రానున్న రోజుల్లో అన్ని వర్గాల ప్రజలకి ప్రమాదకరమని సూచించారు. ఆర్ట్స్ కాలేజీ నుంచి వేదిక వరకు ప్రియాంబుల్ మార్చ్ నిర్వహించారు. కార్యక్రమంలో వక్తలు డా. గాలి వినోద్ కుమార్, జీలకర్ర శ్రీనివాస్, డా. గోగు శ్యామల, లక్ష్మీనర్సయ్య, అంబటి సురేందర్ రాజు, వినోదిని, గోరటి వెంకన్న, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్, గాజోజు నాగభూషణం తదితరులు హాజరయ్యారు.