తెలంగాణ

telangana

ETV Bharat / state

యువకుడిపై బహదూర్​పుర పోలీసుల దౌర్జన్యం - పాతబస్తీ తాజా వార్తలు

హైదరాబాద్ పాతబస్తీలో బహదూర్​పుర పోలీసులు ఓ యువకుడిపై దౌర్జన్యం చేశారు. హఫీజ్ అనే మొబైల్ షాపు నిర్వాహకుడిపై దాడి కూడా చేసినట్లు బాధితుని సోదరుడు తెలిపాడు. తీవ్రంగా గాయపడిన తమ్ముడిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కూడా పోలీసులు అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

యువకుడిపై బహాదుర్‌పుర పోలీసుల దౌర్జన్యం
యువకుడిపై బహాదుర్‌పుర పోలీసుల దౌర్జన్యం

By

Published : Jul 22, 2020, 12:32 AM IST

ఐదు రోజుల క్రితం హైదరాబాద్‌ పాతబస్తీలో హఫీజ్ అనే యువకుడి మొబైల్ షాప్ వద్ద ఇద్దరు యువకులకు గొడవ జరిగింది. వారిద్దరికి నచ్చజెప్పి గొడవను సద్దుమణిగించాడు హఫీజ్.

అయితే మంగళవారం ఉదయం బహదూర్‌పుర ఎస్సై.. హఫీజ్‌ని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి చితకబాదినట్లు బాధితుని సోదరుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ముక్కులో నుంచి తీవ్రంగా రక్తం వస్తున్నా ఆసుపత్రికి తీసుకెళ్లడానికి పోలీసులు అడ్డుకున్నారని పేర్కొన్నాడు.

ఇదీ చూడండి:30 ఏళ్ల ముందస్తు ప్రణాళికతో రిజర్వాయర్​ నిర్మించాం: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details