హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న తెరాస ఒకసారి.. బస్తీల్లో తిరిగి చూడాలని బాగ్అంబర్పేట్ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ అన్నారు. డ్రైనేజీ, నీటి, రహదారి సమస్యలతో డివిజన్ ప్రజలు సతమతమవుతున్నారని తెలిపారు.
'ప్రశ్నించే గొంతుకనై.. సమస్యలు పరిష్కరిస్తా' - ghmc election campaign
తెరాస పాలనలో బాగ్అంబర్పేట్ డివిజన్ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని కాంగ్రెస్ అభ్యర్థి శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ అన్నారు. హస్తం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపిస్తే.. ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
బాగ్ అంబర్పేట్ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి ఉషశ్రీ
డివిజన్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేసిన ఉషశ్రీ.. ప్రజలు సమస్యలను ప్రత్యక్షంగా చూశానని చెప్పారు. తనకు ఓటు వేసి గెలిపిస్తే డివిజన్లోని సమస్యలన్నీ పరిష్కరిస్తానని, బాగ్ అంబర్పేట్ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.