భారీ వర్షాలతో... భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ పనులకు ఆటంకం ఏర్పడింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు 2వ ప్లాంట్ కమర్షియల్ ఆపరేషన్ పనులు నిలిచిపోయాయి. వర్షాలు లేకుంటే సీఓడీ పనులు పూర్తి చేసుకుని... మూడో ప్లాంట్ సింక్రనైజేషన్ పనులు మొదలయ్యేవని అధికారులు తెలిపారు. 2 ప్లాంట్ సీఓడీ పనులు మరింత జాప్యమయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
వర్షం ఎఫెక్ట్: భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ పనులకు ఆటంకం - badradri works break due to rains
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ పనులు నిలిచిపోయాయి. వర్షాలు లేకుంటే సీఓడీ పనులు పనులు పూర్తి చేసుకుని... మూడో ప్లాంట్ సింక్రనైజేషన్ పనులు ప్రారంభమయ్యేవని అధికారులు తెలిపారు.
వర్షం ఎఫెక్ట్: భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ పనులకు ఆటంకం
మూడో ప్లాంట్ సింక్రనైజేషన్ పనులపై ఆ ప్రభావం పడనుందని తెలుస్తోంది. 2015 ఏప్రిల్ 23న సీఎం కేసీఆర్... 1,080 మెగావాట్ల సామర్థ్యంతో తలపెట్టిన బీటీపీఎస్కు శంకుస్థాపన చేశారు. మిగులు విద్యుత్ సాధన లక్ష్యంతో ప్రారంభించిన థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల్లో బీటీపీఎస్ మొదటిది.
ఇదీ చూడండి:మొన్నటి వరకు బోగీలన్నీ ఖాళీ.. ఇప్పుడు అన్ని తరగతులూ ఫుల్!