తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం​ దంపతులకు రామయ్య కల్యాణ తలంబ్రాలు అందజేత - కల్యాణ తలంబ్రాలు సీఎంకు అందజేత

ముఖ్యమంత్రి కేసీఆర్​ దంపతులకు భద్రాద్రి రామయ్య కల్యాణ తలంబ్రాలు, ప్రసాదాన్ని అధికారులు అందించారు. ఈసారి ఎన్నికల కోడ్​ కారణంగా సీఎం కల్యాణ ఉత్సవాలకు గైర్హాజరయ్యారు.

సీఎం కేసీఆర్​

By

Published : Apr 17, 2019, 9:57 AM IST

భ‌ద్రాద్రి సీతారామ కల్యాణానికి సంబంధించిన ముత్యాల తలంబ్రాలు, ప్రసాదాన్ని మంగళవారం హైదరాబాద్​లోని ప్రగతిభవన్​లో సీఎం కేసీఆర్​ దంపతులకు అధికారులు అందజేశారు. దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్​రెడ్డి, దేవాదాయ కమిషనర్​ అనిల్​కుమార్​, ఆలయ ఈవో రమేష్​బాబు, అర్చకులు ముఖ్యమంత్రిని కలిశారు. వేద పండితులు సీఎంకు ఆశీర్వచనాలు అందించారు. ఎన్నికల కోడ్​ కారణంగా ఈసారి కల్యాణ ఉత్సవాలకు సీఎం హాజరు కాలేదు.

తలంబ్రాలు, ప్రసాదం అందించిన అర్చకులు

ABOUT THE AUTHOR

...view details