కరోనా వైరస్ నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న కృషి ఎంతో గొప్పదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జీహెచ్ఎంసీ నార్త్ జోన్ మున్సిపల్ కార్యాలయంలో సినీ దర్శకుడు శేఖర్ కమ్ములతో కలిసి మంత్రి.. పారిశుద్ధ్య సిబ్బందికి బాదం పాలు పంపిణీ చేశారు.
పారిశుద్ధ్య కార్మికులకు శేఖర్ కమ్ముల సాయం - director sekhar kammula distributed badham milk
హైదరాబాద్ నగరపాలక సంస్థ నార్త్ జోన్ కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల, పారిశుద్ధ్య సిబ్బందికి బాదం పాలు పంపిణీ చేశారు. కార్మికులను గౌరవించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.
బాదం పాలు పంపిణీ చేసిన శేఖర్ కమ్ముల
కుటుంబాలను సైతం లెక్కచేయకుండా పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారని మంత్రి అన్నారు. ప్రజల ఆరోగ్య కోసం ఆహర్నిశలు పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను గౌరవించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సహకరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించి.. ఇళ్లల్లోనే ఉండాలని సూచించారు.
ఇవీచూడండి:సుజల దృశ్యం.. సీఎం కేసీఆర్‌తో సాక్షాత్కారం: కేటీఆర్
TAGGED:
director sekhar kammula news