తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈనెల 6న రాష్ట్ర బడ్జెట్.. 8 నుంచి పద్దులపై చర్చ! - pocharam meeting

BAC meeting in ts: శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు, చీఫ్ విప్, కాంగ్రెస్ సభ్యులు పాల్గొన్నారు. గవర్నర్ ప్రసంగాన్ని ఇచ్చారు. దీనికి ధన్యవాదాలు తీర్మానం తెలిపే అంశంపై రేపు చర్చ జరగనుంది.

Pocharam Srinivasa Reddy
పోచారం శ్రీనివాసరెడ్డి

By

Published : Feb 3, 2023, 2:04 PM IST

Updated : Feb 3, 2023, 2:50 PM IST

BAC meeting in ts: బడ్జెట్, పద్దులపై చర్చ, ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ అనంతరం అవసరమైతే మిగిలిన అంశాలపై చర్చ చేపట్టాలని శాసనసభా వ్యవహారాల సలహా సంఘం నిర్ణయించింది. సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో ఉపసభాపతి పద్మారావు, మంత్రులు హరీశ్​ రావు, ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, కాంగ్రెస్ శాసనసభా పక్షనేత మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు.

సమస్యలు, చర్చించాల్సిన అంశాలు అధికంగా ఉన్నందున బడ్జెట్ సమావేశాలు ఎక్కువ రోజులు నిర్వహించాలని భట్టి విక్రమార్క కోరారు. కనీసం 25 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని అన్నారు. అన్ని అంశాలపై చర్చిద్దామన్న మంత్రులు.. బడ్జెట్​పై, పద్దులపై చర్చ, ద్రవ్యవినిమియ బిల్లు అనంతరం అవసరం అనుకుంటే మిగిలిన అంశాలపై చర్చిద్దామని తెలిపారు. కాంగ్రెస్ శాసనసభ్యులకు సరిగా ప్రోటోకాల్ ఇవ్వడం లేదని భట్టి విక్రమార్క ప్రస్తావించారు.

కాన్ స్టిట్యూషన్ క్లబ్ నిర్మాణ అంశాన్ని కూడా ఆయన లేవనెత్తారు. బడ్జెట్ సమావేశాలను 20 రోజుల పాటు నిర్వహించాలన్న మజ్లిస్ పార్టీ.. సమావేశాల్లో చర్చించేందుకు 25 అంశాలను ప్రతిపాదించింది.

ఇవీ చదవండి:

Last Updated : Feb 3, 2023, 2:50 PM IST

ABOUT THE AUTHOR

...view details