తెలంగాణ

telangana

ETV Bharat / state

పసికందును వదిలేశారు.. పాపను పోలీస్​ స్టేషన్​కు చేర్చిన మహిళ - తిరుచానూర్ వార్తలు

కనీసం కళ్లైనా తెరవని ఓ పసికందును గుర్తు తెలియని వ్యక్తులు కోనేటి వద్ద వదిలేశారు. పాప ఏడుపు చూసి చలించిన ఓ మహిళ చిన్నారిని పోలీస్​ స్టేషన్​కు తీసుకెళ్లింది. ఏపీ చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్​ మండలం తిరుచానూరులో జరిగిన ఘటన వివరాలివి..!

పసికందును వదిలేశారు.. పాపను పోలీస్​ స్టేషన్​కు చేర్చిన మహిళ
పసికందును వదిలేశారు.. పాపను పోలీస్​ స్టేషన్​కు చేర్చిన మహిళ

By

Published : Aug 6, 2020, 10:38 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం తిరుచానూరులో దారుణం జరిగింది. ఘంటసాల సర్కిల్ సమీపంలోని కోనేటి వద్ద.. ఓ పసికందును గుర్తు తెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. కళ్లు కూడా తెరవని ఆడబిడ్డను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చిన్నారి ఏడుపు విని.. చలించిన ఓ మహిళ పాపను పోలీస్​ స్టేషన్​కు తీసుకెళ్లింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చిన్నారిని పిల్లల సంరక్షణ అధికారులకు అప్పగించారు.

ABOUT THE AUTHOR

...view details