తెలంగాణ

telangana

ETV Bharat / state

రవీంద్రభారతిలో బేబిరమ్య సంస్మరణ సభ - Condolence Meeting

రాష్ట్రంలో కేరళ తరహా మద్యం పాలసీ తీసుకురావాలన్నారు భాజపా ఎమ్మెల్సీ రాంచంద్రరావు. 2016లో రోడ్డు ప్రమాదంలో మరణించిన రమ్య తరహా ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

రవీంద్రభారతిలో బేబిరమ్య సంస్మరణ సభ

By

Published : Jul 10, 2019, 10:54 AM IST

హైదరాబాద్ రవీంద్రభారతిలో చిన్నారి రమ్య వర్థంతి సభ జరిగింది. జిందగీ ఇమేజస్​ ఈ కార్యక్రమం నిర్వహించింది. 2016లో పంజాగుట్టలోబేబి రమ్య, బాబాయి రాజేశ్​, తాతయ్య మధుసూధనాచారి రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఘటన జరిగి మూడేళ్లు అవుతున్నా... నిందితులకు శిక్షపడలేదని రమ్య తండ్రి రమణ ఆవేదన వ్యక్తం చేశారు.

రవీంద్రభారతిలో బేబిరమ్య సంస్మరణ సభ

కేరళ తరహా మద్యం పాలసీ అవసరం..!

మద్యం సేవించి వాహనాలు నడిపి ఇతరుల ప్రాణాలు తీస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భాజపా ఎమ్మెల్సీ రాంచంద్రరావు పేర్కొన్నారు. కేరళ ప్రభుత్వం మాదిరి మద్యం పాలసీ తీసుకురావాలని ఆయన డిమాండ్‌ చేశారు. రమ్య చట్టాన్ని తీసుకువచ్చేందుకు కౌన్సిల్‌లో తాను పోరాడతానని చెప్పారు.

ఇదీ చూడండి: ప్రైవేటుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్!

ABOUT THE AUTHOR

...view details