తెలంగాణ

telangana

ETV Bharat / state

'నిర్బంధం ద్వారా.. ప్రజాస్వామ్యాన్ని కాలరాయలేరు' - నిర్బంధం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాలరాయలేరు: చంద్రబాబు

‘చలో ఆత్మకూరు’ నేపథ్యంలో ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్​ వ్యాప్తంగా తెదేపా నేతలను గృహ నిర్బంధం చేస్తున్నారు. చంద్రబాబును గృహ నిర్బంధం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఆయన నిరాహార దీక్ష చేపట్టారు.

'నిర్బంధం ద్వారా.. ప్రజాస్వామ్యాన్ని కాలరాయలేరు'

By

Published : Sep 11, 2019, 9:19 AM IST

Updated : Sep 11, 2019, 9:53 AM IST

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర వ్యాప్తంగా ‘చలో ఆత్మకూరు’ను అడ్డుకోవడంపై తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తెదేపా నేతల అరెస్టులను ఖండించారు. నిర్బంధం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాలరాయలేరన్నారు. ప్రశ్నించే గొంతును నొక్కడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. శాంతియుత నిరసనలను అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. ప్రజాస్వామ్యంలో ఇదొక చీకటిరోజుగా అభివర్ణించారు.

పునరావాస శిబిరానికి ఆహారం సరఫరా అడ్డుకుంటారా..?

శిబిరంలో బాధితులకు ఇచ్చే ఆహారం అడ్డుకోవడం అమానుషమని చంద్రబాబు అన్నారు. ఆహారం అందించడానికి వచ్చిన వాళ్లను వెనక్కి పంపేస్తారా..? అని ప్రశ్నించారు. బాధితుల పట్ల ఇంత నిర్దయగా వ్యవహరిస్తారా..? అంటూ మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వ దుర్మార్గాలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు.

ఇదీ చూడండి : 'కల్వకుంట్ల, ఒవైసీ కుటుంబాల చేతుల్లో తెలంగాణ బందీ'

Last Updated : Sep 11, 2019, 9:53 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details