తెలంగాణ

telangana

ETV Bharat / state

యాత్ర చేసే తీరుతా.. షూట్ మీ: చంద్రబాబు - chandrababu fire on ap governament

విశాఖ పర్యటనకు వస్తే.. తమపై దారుణంగా ప్రవరిస్తున్నారని ఏపీ ప్రతిపక్షనేత, తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యటనకు అనుమతి తీసుకున్నామని గుర్తు చేశారు.

chandrababu fire on ap govt
యాత్ర చేసే తీరుతా.. షూట్ మీ: చంద్రబాబు

By

Published : Feb 27, 2020, 7:16 PM IST

విశాఖ పర్యటనలో తమపై వైకాపా శ్రేణులు దాడి చేశారని ఏపీ ప్రతిపక్ష నేత, తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. గంట, రెండు గంటలు ఆగితే పంపిస్తామని పోలీసులు చెప్పారని... ఇప్పుడేమో వెనక్కి వెళ్లాలని చెబుతున్నారని పేర్కొన్నారు. ఏ చట్టం కింద వెనక్కి వెళ్లాలని చెబుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. తాను చట్టాన్ని ఉల్లంఘించనని.. పూర్తిగా సహకరిస్తానని అన్నారు. న్యాయపరంగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు. విశాఖలో భూకబ్జాలు జరిగాయన్న చంద్రబాబు.. నిజమో? కాదో? ప్రజలే తేలుస్తారన్నారు.

యాత్ర చేసే తీరుతా.. షూట్ మీ: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details