ముంబయిలోని టాటా సామాజిక శాస్త్ర అధ్యయనాల సంస్థ (టిస్) సలహా మండలి సభ్యులుగా తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ నియమితులయ్యారు. రెండేళ్ల పాటు ఈ బాధ్యతలు నిర్వహించనున్నారు. 1964 సంవత్సరంలో టిస్‌ను గ్రేడ్ వన్ డీమ్డ్ యూనివర్సిటీగా కేంద్ర ప్రభుత్వం గుర్తింపునిచ్చింది. యూజీసీ నిధులతో టిస్ నిర్వహణ సాగుతోంది.
సీనియర్ పార్లమెంటేరియన్‌గా అవగాహన, న్యాయవాదిగా దశాబ్దాల అనుభవం, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆ అంశాలను పరిగణనలోకి తీసుకుని పాలకమండలి తరుపున టిస్ ఛైర్మన్ ఎస్.రామదురై ఆయనను ఎంపిక చేసినట్లు హైదరాబాద్ ప్రాంగణ డైరెక్టర్ షాలిని భరత్ ప్రకటించారు.