ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖకు చెందిన ఓ మహిళ మొబైల్‌కు తన వ్యక్తిగత సమాచారంతో కూడిన చిత్రాలు, సంభాషణలు మెయిల్స్ రూపంలో వచ్చేవి. ఆశ్చర్యపోయిన మహిళ నగర సైబర్‌క్రైమ్ విభాగాన్ని ఆశ్రయించింది. హ్యకింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు నేరగాన్ని గుర్తించి అరెస్ట్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరానికి చెందిన కాటూరి శైలేష్ ఈ సైబర్ నేరాలకు పాల్పడినట్లు నిర్ధరించారు. నిందితుడు బీటెక్ చదువు మధ్యలో ఆపేశాడు. వెబ్‌డెవలపింగ్, ఫిషింగ్, ఆండ్రాయిడ్ విభాగాల్లో పట్టు సాధించి హ్యకింగ్ చేస్తున్నాడు. గతంలోనూ ఓ మహిళను ఇలాగే బెదిరించాడని పోలీసులు పేర్కొన్నారు. ఎట్టకేలకు విశాఖలో హ్యకర్ అరెస్టయ్యాడని.. నిందితుడిని రిమాండ్‌కు తరలించామని తెలిపారు.
బీటెక్ మధ్యలో ఆపేసి హ్యాకరయ్యాడు... చివరకు అరెస్టయ్యాడు - b tech hacker in ap arrested
తన ఫోన్లో తీసిన చిత్రాలు.. మాట్లాడిన మాటలు.. చాటింగ్స్ తిరిగి ఆమె మొబైల్‌కే మెయిల్స్లాగా వస్తున్నాయి. ఆశ్చర్యపోయిన ఆ మహిళ విశాఖ సైబర్ పోలీసులను ఆశ్రయించింది. సీన్ కట్‌చేస్తే ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో బీటెక్ హ్యకర్ అరెస్టయ్యాడు. అసలేం జరిగిందంటే...
హ్యాకరయ్యాడు... చివరకు అరెస్టయ్యాడు