కరోనా నియంత్రణ కోసం ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం ఉప్పల్ క్రికెట్ స్టేడియంలోనూ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ లేఖ రాశారు. స్టేడియంలో 40పెద్ద గదులతోపాటు పార్కింగ్ సౌకర్యం ఉందని ఆయన పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్‌కు అజారుద్దీన్ లేఖ - ఉప్పల్ స్టేడియం
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ కోరారు.
![సీఎం కేసీఆర్‌కు అజారుద్దీన్ లేఖ HCA President azzaruddin respond about carona](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6536690-574-6536690-1585121004017.jpg)
HCA President azzaruddin respond about carona
ఐసోలేషన్ వార్డుల ఏర్పాటుకు ఉప్పల్ స్టేడియంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ తరఫున రాసిన లేఖలో అజారుద్దీన్ వివరించారు.
ఇవీ చూడండి:మరో రెండు పాజిటివ్... రాష్ట్రంలో 39కి చేరిన కరోనా కేసులు