కేరళలో ఘనంగా నిర్వహించే అయ్యప్ప స్వామి విశు పూజ మహోత్సవాలను పురస్కరించుకొని హైదరాబాద్ బాగ్ అంబర్పేటలో అయ్యప్ప దేవాలయంలో మహా పడిపూజను ఘనంగా నిర్వహించారు. 18 మెట్లను పూలతో అలంకరించి... కర్పూర దీపాలు వెలిగించి పడి పూజ చేశారు. కన్నులపండువగా మహా పడిపూజ జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయ్యప్ప కీర్తనలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
వైభవంగా అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం - హైదరాబాద్ తాజా వార్తలు
అయ్యప్ప పడిపూజ మహోత్సవాన్నిబాగ్ అంబర్పేటలో నిర్వహించారు. ఆద్యంతం కన్నులపండువగా సాగిన ఈ పూజలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయ్యప్ప కీర్తనలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది.
అయ్యప్ప స్వామి పడిపూజ