గంగపుత్ర నర్సింగ్ రావు గురు స్వామి 13వ సారి అయ్యప్ప మాల ధరించినందున హైదరాబాద్ హబ్సిగూడ నవోదయ కాలనీలోని తన నివాస ప్రాంగణంలో అయ్యప్ప పడిపూజను వైభవంగా నిర్వహించారు. మెట్టుగూడ అయ్యప్ప ఆలయం ప్రధాన అర్చకుడు కృష్ణ ప్రసాద్ నంబూద్రి తంత్రి ఆధ్వర్యంలో తంత్ర పద్ధతిలో అయ్యప్ప 18 మెట్లకు పడిపూజ కార్యక్రమాన్ని చేపట్టారు.
హబ్సిగూడలో వైభవంగా అయ్యప్ప పడిపూజ
హైదరాబాద్ హబ్సిగూడలో అయ్యప్ప స్వామి పడిపూజ వైభవంగా జరిగింది. గంగపుత్ర నర్సింగ్ రావు గురుస్వామి భజన మండలి పాడిన అయ్యప్ప భక్తి పాటలు భక్తులను అలరించాయి.
హబ్సిగూడలో అంగరంగ వైభవంగా అయ్యప్ప పడిపూజ
పూజకు వచ్చిన భక్తులకు భూతనాధ అయ్యప్ప స్వామి భజన పాటల సీడీలను ఉచితంగా అందజేశారు. అయ్యప్ప శరణు ఘోషతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. శ్రీరంగ ఆచార్య ఆత్రేయ స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి పంచామృత అభిషేకం.. గణపతి, కుమార స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమంలో అయ్యప్ప మాలధారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి: యాదాద్రికి భక్తుల తాకిడి... కిటకిటలాడిన ఆలయం