ఈఎస్ఐ కుంభకోణంపై అవినీతి నిరోధక శాఖ కాల్ సెంటర్‌కు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఫిర్యాదు చేశారు. టోల్‌ఫ్రీ నంబర్‌కు స్వయంగా ఫోన్ చేసిన వివరాలు అందజేశారు. ఈఎస్‌ఐ ఇన్సూరెన్స్ కంపెనీలో అవినీతి జరిగిందని వివరించారు. స్పందించిన సిబ్బంది... అనిశా కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని మాజీ మంత్రికి సూచించారు.
ఏపీ: మంత్రి జయరాంపై అ.ని.శా. కాల్సెంటర్లో అయ్యన్న ఫిర్యాదు ఏం చెప్పారంటే...
'ఈఎస్ఐ కుంభకోణంలో కార్మికశాఖ మంత్రి ప్రమేయం ఉందనేది అభియోగం. కుంభకోణంలో మంత్రి కుమారుడు ఈశ్వర్‌కు కూడా ప్రమేయం ఉంది. మంత్రి కుమారుడు ఈశ్వర్‌కు లంచంగా బెంజ్ కారు ఇచ్చారు. అవినీతి జరిగితే ఫోన్ చేయాలని ప్రభుత్వం చెబుతోంది. దాని ప్రకారం ఫిర్యాదుపై వెంటనే స్పందించి 24 గంటల్లో చర్యలు తీసుకోవాలి. కుంభకోణం విషయంలో పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాం'- అయ్యన్నపాత్రుడు, మాజీ మంత్రి
ఇదీ చదవండి:'ఈఎస్ఐ కుంభణంలో మంత్రి పాత్ర... తొలగించి విచారించండి'