Ayyanna patrudu and his son were doctors conducted medical tests : ఇంటి గోడ కూల్చివేత ఘటనలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారంటూ ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్ తెదేపా నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు, అతని కుమారుడికి సింహాచలం ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. వారివురికి సుమారు 20 నిమిషాల పాటు ప్రభుత్వ వైద్యాధికారి భాస్కరరావు పరీక్షలు చేశారు. అయ్యన్న ఒత్తిడికి లోనవుతున్నారని.. బీపీతో ఇబ్బంది పడుతున్నారని వైద్యులు వెల్లడించారు. వైద్య పరీక్షల అనంతరం సీఐడీ కార్యాలయానికి అయ్యన్న, అతని కొడుకు రాజేశ్‌ను తీసుకొచ్చారు.
అసలేం జరిగిందంటే:ఏపీతెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడును సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. తెల్లవారుజామున పెద్దసంఖ్యలో అయ్యన్న ఇంటికి వెళ్లిన పోలీసులు, ఆయనతోపాటు చిన్న కుమారుడు రాజేశ్నూ అరెస్టు చేశారు. ఇంటి గోడ కూల్చివేతలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారంటూ వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. అయ్యన్నపాత్రుడిని ఏలూరు కోర్టులో హాజరుపరుస్తామని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు.