ఆయుష్మాన్ భారత్ యోజన పథకం కింద దక్షిణ మధ్య రైల్వేలోని నాలుగు రైల్వే ఆసుపత్రులలో లబ్దిదారులకు వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ లాలాగూడకు చెందిన సెంట్రల్ ఆసుపత్రి, విజయవాడ, గుంతకల్లు, నాందేడ్‌లోని డివిజనల్ రైల్వే ఆసుపత్రుల్లో ఈ సేవలు పొందవచ్చు.
దక్షిణ మధ్య రైల్వే పరధిలో ఆయుష్మాన్ భారత్ - Of the four railway hospitals in South Central Railway under Ayushman Bharat Yojana Scheme
పలు రాష్ట్రాల్లో ఇప్పటికే అమల్లో ఉన్న 'ఆయుష్మాన్ భారత్- ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన' పథకం దక్షిణ మధ్య రైల్వే పరధిలో అందుబాటులోకి వచ్చింది.

దక్షిణ మధ్య రైల్వే పరధిలో ఆయుష్మాన్ భారత్
ఆయుష్మాన్ ఆరోగ్య యోజన కింద ప్రతి కుటుంబానికి ఏటా రూ. 5 లక్షల విలువైన వివిధ రకాల వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. 10.74 కోట్ల కుటుంబాలకు ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని రైల్వే శాఖ వెల్లడించింది. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వ కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోగ్య ఏజెన్సీల మధ్య ఒప్పందం జరిగింది. దానికనుగుణంగా లబ్ధిదారులు వైద్య సేవలు పొందవచ్చని అధికారులు పేర్కొన్నారు.
దక్షిణ మధ్య రైల్వే పరధిలో ఆయుష్మాన్ భారత్
ఇదీ చూడండి : హెచ్‌ఎండీఏపై మంత్రి కేటీఆర్ సమీక్ష