తెలంగాణ

telangana

ETV Bharat / state

అయేషా గోళ్లు, ఎముకలు, కేశాల పరిశీలన

అయేషా మీరా మృతదేహానికి రీ పోస్టుమార్టం జరుగుతోంది. దిల్లీ నుంచి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణులు అయేషా మృతదేహం ఆనవాళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆధారాలు సేకరించి నివేదిక తయారుచేస్తామని అధికారులు తెలిపారు.

Ayesha meera repost martam
Ayesha meera repost martam

By

Published : Dec 14, 2019, 12:19 PM IST

Updated : Dec 14, 2019, 12:35 PM IST


అయేషా మీరా మృతదేహానికి రీ పోస్టుమార్టం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటలోని శ్మశాన వాటికలో అయేషా మృతదేహానికి శవపరీక్ష చేస్తున్నారు. దిల్లీ నుంచి వచ్చిన ఫోరెన్సిక్‌ నిపుణుల ఆధ్వర్యంలో రీ పోస్టుమార్టం జరుగుతుంది. సీబీఐ విచారణలో భాగంగా మృతదేహానికి మరోసారి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు.

అయేషామీరా మృతదేహం వెలికితీసి... ఫోరెన్సిక్ నిపుణులు ఆనవాళ్లు నమోదు చేసుకున్నారు. ఎముకలు, కేశాలు, గోళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆధారాలు సేకరించి పూర్తి నివేదిక తయారుచేయనున్నట్లు ఫోరెన్సిక్ బృందం తెలిపింది.

అయేషా గోళ్లు, ఎముకలు, కేశాల పరిశీలన
Last Updated : Dec 14, 2019, 12:35 PM IST

ABOUT THE AUTHOR

...view details