కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ పోలీసులు వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు. ప్రజా చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో పంజాగుట్ట వద్ద రోబోలతో ప్రచార కార్యక్రమాన్ని ఏసీపీ తిరుపతి ప్రారంభించారు.
పంజాగుట్టలో కరోనాపై రోబోలతో అవగాహన - Awareness with Robots for People on Corona virus
హైదరాబాద్‌లో వాహనాదారులకు కరోనా వైరస్‌పై రోబో సాయంతో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. అత్యవసర సమయంలో బయటకు వస్తే మాస్కులు ధరించాలని ఏసీపీ తిరుపతి పేర్కొన్నారు.
కరోనాపై రోబోలతో అవగాహన
ప్రభుత్వం సూచించిన నియమాలను ప్రజలు తప్పక పాటించాలని ఈ సందర్భంగా సూచించారు. అత్యవసర సమయంలో బయటకు వస్తే మాస్కులు ధరించాలని ఆయన పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ ఆరోగ్యసేతు మొబైల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
TAGGED:
కరోనాపై రోబోలతో అవగాహన