AWARENESS ON DRUGS: రాబోయే 15 సంవత్సరాలలో దేశంలో నిరుద్యోగం, డ్రగ్స్ వంటి రెండు ప్రధాన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. బాగ్లింగంపల్లిలోని ఆర్టీసి కళ్యాణ మండపంలో మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు వాటి నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రచార కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పలు పాఠశాలల, కళాశాలల విద్యార్థులకు అవగాహన కల్పించారు. డ్రగ్స్ వల్ల ప్రస్తుతం పంజాబ్‌లో పరిస్థితి అదుపు తప్పిందని అలాంటి స్థితి హైదరాబాద్లో రాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని సీవీ ఆనంద్ తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో గంజాయి వాడకం ఇప్పుడిప్పుడే పెరుగుతోందన్న ఆయన.. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువత గంజాయికి అలవాటు పడుతున్నారని తెలియచేశారు. ఇలా చేయడం వల్ల వారి భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుందన్నారు. వీటిని పూర్తిగా నియంత్రించేందుకు అందరూ ముందుకు రావాలని కోరారు.