రాష్ట్రంలో మళ్లీ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాచకొండ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఎల్బీనగర్ ట్రాఫిక్ అదనపు ఇన్‌స్పెక్టర్ నాగమల్లు ఆధ్వర్యంలో కొత్తపేట కూడలి వద్ద పోలీసు కళాబృందంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
నాటక రూపంలో అవగాహన కల్పిస్తున్న ట్రాఫిక్ పోలీసులు - కొత్తపేట నాటక ప్రదర్శన
రాచకొండ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు కరోనాపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్రంలో మళ్లీ కొవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో జాగ్రత్తలు పాటించకపోతే వచ్చే పరిణామాలను పోలీసు కళాబృందంతో నాటక రూపంలో ప్రదర్శించారు.
రాచకొండ ట్రాఫిక్ పోలీస్, కొత్తపేట , కరోనాపై అవగాహన కార్యక్రమం
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీఓ 68 ప్రకారంగా ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. శానిటైజర్లు ఉపయోగించి ఆరోగ్య నియమాలు పాటించి కరోనా ప్రభావం నుంచి తమను తాము రక్షించుకోవాలన్నారు. వ్యక్తిగత జాగ్రత్తలు పాటించకుండా ఉంటే వచ్చే పరిణామాలను వాహనదారులకు అర్థమయ్యే రీతిలో నాటక రూపంలో ప్రదర్శించారు.
ఇదీ చూడండి: దత్తగిరి ఆశ్రమాన్ని దర్శించుకున్న మేయర్ విజయలక్ష్మి