తెలంగాణ

telangana

ETV Bharat / state

'సీఎన్​జీ సిలిండర్​ ఎక్కువ కాలం వినియోగిస్తే ప్రమాదం' - lpg gas

సికింద్రాబాద్​లో వినియోగదారుల హక్కుల సంఘం ఆధ్వర్యంలో సీఎన్​జీ, ఎల్పీజీ వాహనాలను టెస్టింగ్​ చేయాలని అవగాహన కార్యక్రమం చేపట్టారు. సీఎన్​జీ సిలిండర్​ను ఎక్కువ కాలం వినియోగిస్తే ప్రమాదాలు జరుగుతాయని సూచించారు.

'సీఎన్​జీ సిలిండర్​ ఎక్కువ కాలం వినియోగిస్తే ప్రమాదం'

By

Published : Nov 20, 2019, 7:34 PM IST

సీఎన్​జీ, ఎల్పీజీ సాయంతో నడిచే వాహనాలను టెస్టింగ్ చేయాలని వినియోగదారుల హక్కుల సంఘం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. సికింద్రాబాద్​లోని ఓ ఎల్పీజీ గ్యాస్ స్టేషన్​లో వినియోగదారులకు వాటికి సంబంధించిన వివరాలను అవగతమయ్యేలా తెలియజేశారు. సీఎన్​జీ సిలిండర్ మూడు సంవత్సరాలకు ఒక పర్యాయం మార్చాలని... ఎక్కువ కాలం వినియోగించడం వల్ల ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుందన్నారు. భవిష్యత్తులో పూర్తిగా సీఎన్​జీతో నడిచే వాహనాలు ఎక్కువగా వస్తాయని అందుకు అనుగుణంగా వాహనదారులకు కరపత్రాలు అందజేస్తున్నట్లు వెల్లడించారు.
సీఎన్​జీ, ఎల్పీజీ వాహనాలు నడిపే వాహనదారులు టెస్టింగ్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని దాని వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం వాటి కాలపరిమితి విషయంలో అవగాహన కల్పించడంలో విఫలమైందని అన్నారు.

'సీఎన్​జీ సిలిండర్​ ఎక్కువ కాలం వినియోగిస్తే ప్రమాదం'

ABOUT THE AUTHOR

...view details