క్యాన్సర్‌పై అవగాహనతో ఆదిలోనే అంతమొందించే లక్ష్యంతో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి, నిజాంపేట్ ప్రహరీ ట్రస్ట్ సౌజన్యంతో విజ్ఞాన్ కళాశాలలో క్యాన్సర్ నిర్ధరణ శిబిరం నిర్వహించారు. వ్యాధి లక్షణాలను గుర్తించేందుకు ముందుగా చేయాల్సిన పనులను గురించి వివరించారు. వ్యాధిని ఆరంభంలో గుర్తించినట్లయితే చికిత్స సాధ్యమని తెలిపారు.
క్యాన్సర్‌పై అవగాహన ఎంతో అవసరం - బసవతారకం ఆసుపత్రిలో క్యాన్సర్‌పై అవగాహన
హైదరాబాద్‌లో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి, నిజాంపేట్ ప్రహరి ట్రస్ట్ సౌజన్యంతో విజ్ఞాన్ కళాశాలలో క్యాన్సర్ నిర్ధరణ శిబిరం నిర్వహించారు.
క్యాన్సర్‌పై అవగాహన ఎంతో అవసరం
వ్యాధి లక్షణాలను బట్టి వారికి సలహాలు ఇవ్వడం అవసరమైనవారికి మందులు అందజేస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మామూగ్రఫీ గర్భాశయ స్కానింగ్, పాస్ మీయర్, ఎక్సరే తదితర పరీక్షలు నిర్వహించి రిపోర్టులు అందజేశారు. వ్యాధి నిర్ధరణ జరిగిన వారికి బసవతారకం ఇండో అమెరికన్ ఆసుపత్రిలో పేదవారికి చికిత్స ఉచితంగా చేస్తారని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: 'ఈటీవీ భారత్'ను సందర్శించిన సూపర్‌స్టార్ రజనీ
TAGGED:
Awareness program on cancer